ETV Bharat / sitara

'సలార్'​ స్పెషల్​ సాంగ్​లో 'కేజీఎఫ్​' భామ! - సలార్ ఐటెంసాంగ్​లో శ్రీనిధి శెట్టి

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో 'సలార్' చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం 'కేజీఎఫ్'​ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు సమాచారం. ఈ బంపర్​ ఆఫర్​కు ఆమె అంగీకరించిందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

KGF beauty Srinidhi Shetty to dance a special Song in Salaar
'సలార్'​ స్పెషల్​ సాంగ్​లో 'కేజీఎఫ్​' భామ!
author img

By

Published : May 4, 2021, 7:08 AM IST

కథానాయకుడు ప్రభాస్‌ నుంచి రానున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో 'సలార్‌' కూడా ఒకటి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడీ పాట కోసం కన్నడ తార శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారని సమాచారం. ఆమె ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన 'కేజీఎఫ్‌'తోనే నాయికగా తెరపై అరంగేట్రం చేసింది.

'కేజీఎఫ్​' చిత్రంలో యశ్​తో ఆమె చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ ఆమె ప్రతిభను మెచ్చి 'సలార్‌'లో ప్రత్యేక గీతానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీనిధి ప్రస్తుతం 'కేజీఎఫ్‌ 2'లోనూ యశ్​ సరసన ఆడిపాడుతోంది.

ఇదీ చూడండి: రీమేక్​ కథలపై టాలీవుడ్​ హీరోల చూపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.