ప్రాంతీయ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కేజీఎఫ్'.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇందులో హీరోగా నటించిన కన్నడ నటుడు యశ్.. క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇతడు 'కేజీఎఫ్' రెండో భాగంలో నటిస్తున్నాడు. అయితే యశ్ నటించబోయే తర్వాతి సినిమాలో హీరోయిన్గా తమన్నా కనిపించనుందని సమచారం.
ఇంతకు ముందు 'కేజీఎఫ్'లోని ప్రత్యేక గీతంలో తమన్నా.. యశ్‌తో కలిసి నర్తించింది. ఇప్పుడు వీరిద్దరూ పూర్తిస్థాయి చిత్రం చేస్తుండటం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నార్తన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే మిల్కీబ్యూటీతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందని, త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయని టాక్. దీనితో పాటే ప్రశాంత్ నీల్ తీస్తున్న 'కేజీఎఫ్-2'.. అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.