ETV Bharat / sitara

"అంకిత భావం గల వ్యక్తి అక్షయ్" - salagharhi

బాలీవుడ్ చిత్రం 'కేసరి' ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనురాగ్ సింగ్ మనతో కొన్ని విషయాలు పంచుకున్నారు.

అనురాగ్ సింగ్
author img

By

Published : Mar 18, 2019, 7:22 PM IST

Updated : Mar 19, 2019, 8:04 PM IST

అక్షయ్ కుమార్ హీరోగా సారాగర్హి యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'కేసరి'. 1897లో ఆఫ్గాన్ పఠాన్​లకు, బ్రిటీష్ ఇండియాకు మధ్య జరిగిందీ యుద్ధం. కేవలం 21మంది సిక్కు సైనికులు.. వేల సంఖ్యలో ఉన్న ఆఫ్గాన్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనేది చిత్ర కథాంశం.

కరణ్​జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు అనురాగ్ కొన్ని విషయాలు పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్టార్​హీరోతో పనిచేయడం ఎలా అనిపిస్తోంది?

సినిమాలో అగ్రకథానాయకుడు ఉన్నాడా లేదా అని ఆలోచించను. కథ ప్రకారమే ముందుకెళ్తాను. స్టార్ హీరో ఉంటే బాధ్యత పెరుగుతుంది. అభిమానులను దృష్టిలో ఉంచుకుని చిత్రాన్ని తెరకెక్కించాలి. అంకిత భావం గల వ్యక్తి అక్షయ్. ఒక్కసారి కథను నమ్మాడంటే దర్శకుడు ఏం చెబితే అదే చేసేవాడు.

ఇదే కథపై మరో రెండు చిత్రాలొస్తున్నాయి(అజయ్ దేవగణ్ చిత్రంపై), వాటిపై మీ స్పందన..

మంచి కథను ఎవరైనా ఎంచుకునే హక్కుంది. నేను రెండేళ్ల నుంచి ఈ చిత్రం కోసం చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరూ దీన్ని తీయడానికి ముందుకు రాలేదు.

ఈ చిత్రానికి మొదట సల్మాన్ నిర్మాతగా వ్యవహరించి తప్పుకున్నారు. అజయ్ దేవగణ్ ఈ కథను తీస్తున్నాడు కాబట్టి అతను కోసమే తప్పకున్నాడని అనుకుంటున్నారా?

అలాంటిందేమి లేదు. కథా చర్చల్లో భాగంగానే తప్పుకున్నారు. ప్రతి దర్శకుడు వారి నిర్మాతలు మెచ్చేలా సినిమా తీయాలనుకుంటాడు.

కరణ్, అక్షయ్​లతో కలిసి పనిచేశారు ఎలా అనిపించింది?

ఇద్దరు గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నప్పుడు బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఒత్తిడిని నాపై మోపలేదు వారిద్దరూ. సినిమా పట్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు. నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించారు. వంద శాతం న్యాయం చేశానని అనుకుంటున్నాను.

సినిమాపై అంచనాలున్నాయి, దీనిపై మీ స్పందన..

చిత్ర కథాంశం అలాంటిది. చారిత్రక నేపథ్యం ఉండటం, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించడం...దీంతో సాధారణంగానే అంచనాలు పెరుగుతాయి. చిత్రంపై పూర్తి సంతృప్తిగా ఉన్నాను. బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను.

2007లో రఖీబ్ చిత్రంతో బాలీవుడ్​లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు అనురాగ్. 'జాట్ అండ్ జూలియట్', 'సూపర్ సింగ్', 'పంజాబ్ 1984' లాంటి పంజాబీ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెరకెక్కించిన 'కేసరి'.. మార్చి 21న విడుదల కానుంది.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 19, 2019, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.