ETV Bharat / sitara

'పెంగ్విన్​'లో కీర్తి సురేశ్ మేకప్​మ్యాన్​ కూడా! - కీర్తి సురేశ్ తాజా వార్తలు

తన కొత్త సినిమా విశేషాలు చెప్పిన నటి కీర్తి సురేశ్.. మేకప్​మ్యాన్, లైట్​మ్యాన్ కూడా 'పెంగ్విన్'లో నటించారని వెల్లడించింది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'పెంగ్విన్​'లో కీర్తి సురేశ్ మేకప్​మ్యాన్​ కూడా!
పెంగ్విన్​లో కీర్తి సురేశ్
author img

By

Published : Jun 18, 2020, 4:51 PM IST

మరికొన్ని గంటల్లో కీర్తి సురేశ్ 'పెంగ్విన్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పిందీ భామ. ఈ చిత్రం కోసం పనిచేసిన లైట్​మ్యాన్, మేకప్​మ్యాన్​.. ఇందులో నటించారని చెప్పుకొచ్చింది. దీనితో పాటే మాస్క్​ విలన్​ గురించి వెల్లడించింది.

"పెంగ్విన్​లో నా పాత్ర పేరు 'రిథమ్'. ఇది విన్న తర్వాత సంగీతం ప్రధానంగా సాగే సినిమా అనుకున్నా. తర్వాత నా అంచనా తప్పని తేలింది. ఈశ్వర్ కార్తిక్.. ఈ కథను నాలుగు గంటల్లో చెప్పాడు. ఇలాంటి వాటి కోసం నేను ఎదురుచూస్తున్నా అని అప్పుడు అనిపించింది" -కీర్తి సురేశ్, కథానాయిక

" class="align-text-top noRightClick twitterSection" data="
">

షూటింగ్​ను గుర్తు చేసుకున్న కీర్తి సురేశ్.. ఈ సినిమాలో నటించిన మాస్క్​ విలన్​ గురించి పంచుకుంది.

"పెంగ్విన్​ను 35 రోజుల్లో తీశాం. ఇది చాలా తక్కువ సమయం. ఈ చిత్రం కోసం పనిచేసిన లైట్​మ్యాన్, మేకప్​మ్యాన్​ కూడా ఇందులో నటించారు. చిత్రీకరణ జరిగినన్నీ రోజలు ఎంతో సరదగా సాగిపోయింది. అయితే మాస్క్​మ్యాన్ గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ముసుగు తొలగకుండా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాం" -కీర్తి సురేశ్, కథానాయిక

ఈ సినిమాలో తప్పిపోయిన కొడుకు అజయ్ కోసం వెతికే తల్లి పాత్రలో కీర్తి నటించింది. జూన్ 19న అమెజాన్ ప్రైమ్​లో తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.