ETV Bharat / sitara

కీర్తి సురేశ్ కెరీర్​నే మలుపు తిప్పిన ఆ సినిమా!

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్.. శనివారం(అక్టోబరు 17) 28వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.

keerthy suresh birthday
హీరోయిన్ కీర్తి సురేశ్
author img

By

Published : Oct 17, 2020, 5:31 AM IST

నటి కీర్తి సురేశ్ అంటే మీకు తెలియకపోవచ్చు కానీ 'మహానటి' హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అభినయం పలికించింది. టాలీవుడ్ ప్రేక్షకుల అశేష అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కీర్తి తన కెరీర్, జీవితం గురించి గతంలో చెప్పిన సంగతులు మరోసారి చూద్దాం.

keerthy suresh birthday
హీరోయిన్ కీర్తి సురేశ్

2000లో బాలనటిగా ఎంట్రీ

మలయాళ నటుడు, నిర్మాత సురేశ్ కుమార్-నటి మేనకల కుమార్తె కీర్తి సురేశ్. 1992 చెన్నైలో జన్మించింది. 2000లో మలయాళ చిత్రం 'పైలట్స్'తో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది.

2013లో హీరోయిన్​గా ఎంట్రీ

మలయాళ సినిమా 'గీతాంజలి'తో హీరోయిన్​గా పరిచయమైంది కీర్తి. 2016లో 'నేను శైలజ'తో టాలీవుడ్​లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ తమిళంలో బిజీ కావడం వల్ల మళ్లీ 2018లో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'తో ప్రేక్షకులను పలకరించింది.

'మహానటి'తో కీర్తి కెరీర్​కు మలుపు

దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా గతేడాది వచ్చిన 'మహానటి' సినిమా.. కీర్తి సురేశ్ కెరీర్​ను మలుపు తిప్పింది. కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అద్భుతమైన నటనకుగాను ఆమెను జాతీయ అవార్డు కూడా వరించింది.

keerthy suresh birthday
నటి కీర్తి సురేశ్

లక్ష్యం పెద్దదిగా ఉండాలి

ఏ రంగంలో అయినా రాణించాలంటే మన లక్ష్యం పెద్దదిగా ఉండాలని, పోటీపడే మనుషులు మన చుట్టూ ఉండాలని చెప్పింది కీర్తి సురేశ్. సినిమా రంగం అందుకు మినహాయింపు కాదని అంటోంది.

అదృష్టం ఉంటే సరిపోదు

పోటీ అనేది మనల్ని మరింత మెరుగుపడడానికి సహాయపడుతుంది. ప్రతిభ, అదృష్టం పక్కపక్కనే ఉంటాయి. అవి రెండు జోడు గుర్రాల్లాంటివి. ఒకదానికొక్కటి సాయం చేసుకోవాల్సిందే. స్టార్​ అయిన వాళ్లు ఎవరైనా సరే కేవలం అదృష్టంతోనే విజేతలు కాలేదు. ఎంతో గట్టి పోటీని తట్టుకుని ఈస్థాయికి వచ్చారని కీర్తి సురేశ్ చెప్పింది.

keerthy suresh birthday
హీరోయిన్ కీర్తి సురేశ్

ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు

ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తుండటం వల్ల పెళ్లి గురించి ఆలోచించడం లేదని కీర్తి తెలిపింది. ఇంకా మంచి పాత్రలు పోషించాలని, అద్భుతమైన చిత్రాల్లో నటించాలని స్పష్టం చేసింది. ఆ కలలన్నీ నెరవేరిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది.

నన్ను సావిత్రి అనుకుని పొరబడ్డారు

'మహానటి' సినిమా తనపై చాలా ప్రభావం చూపిందని కీర్తి సురేశ్ చెప్పింది. ఆ చిత్రం చేసిన తర్వాత ఓసారి గుంటూరు వెళ్తే ఓ పెద్దాయన చూసి.. 'మీరు సావిత్రిగారే కదా?' అని అడిగారు. 'నేను సావిత్రిగారిని కాదండీ, అలా నటించాను' అని చెప్పాను. 'లేదు లేదు మీరు సావిత్రిగారే' అని ఆయన అన్నారు.

keerthy suresh birthday
మహానటి సినిమాలో కీర్తి సురేశ్

ఇలా ఉన్నానంటే అమ్మనాన్నే కారణం

తన కెరీర్​లో దొర్లిన తప్పులు చాలా తక్కువని, అమ్మనాన్నల సరైన గైడెన్స్ అందుకు కారణమని చెప్పారు. వారు సినీ పరిశ్రమకు చెందిన వారు కావడం వల్ల తన ఎదుగుదలకు కారణమయ్యారని తెలిపింది.

ప్రస్తుతం మిస్ ఇండియా, గుడ్​లక్ సఖి, అన్నాత్తే, రంగ్ దే, సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది కీర్తి సురేశ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.