తన అందం, అభినయాలతో ప్రేక్షకులను మెప్పించిన నటి కీర్తి సురేశ్. 'మహానటి' సినిమాలో సావిత్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ పురస్కారం దక్కించుకొని మరో స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటిస్తున్న 'సర్కారు వారి పాట'లో బ్యాంకు అధికారిగా కనిపించనుందని సమాచారం.
'గీతగోవిందం'తో జోరుమీదున్న దర్శకుడు పరశురామ్. 'సరిలేరు నీకెవ్వరు'తో తిరుగులేని హిట్టుకొట్టారు మహేశ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్థిక, బ్యాంకు కుంభకోణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతునుందట. కరోనా వైరస్ పరిస్థితుల్లో నిలిచిపోయిన షూటింగ్.. సెప్టెంబర్, అక్టోబర్‌లో మొదలు కానుంది సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేశ్ ఖాతాలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన 'మిస్ ఇండియా' నిర్మాణం పూర్తయినట్టు తెలుస్తోంది. నితిన్‌కు జోడీగా 'రంగ్ దే', నగేశ్ కుకునూర్ స్పోర్ట్స్ కామెడీ చిత్రంలోనూ ప్రధానపాత్రలు పోషిస్తోంది.
ఇది చదవండి:పారితోషికం తగ్గించుకున్న కీర్తి సురేశ్!