తమిళ స్టార్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కలిసి నటించబోయే సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే నిరవధిక వాయిదా పడింది. సాధారణంగా ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 15న ప్రారంభంకావాల్సింది. కానీ ఇటీవల కత్రినకు కరోనా పాజిటివ్ రావడం వల్ల చిత్రీకరణను వాయిదా వేసినట్లు తెలిపారు విజయ్. ఈ చిత్రానికి 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రాజ్, డీకే సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్‌సిరీస్ 'గవర్'లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా నటించనున్నారు. దీని షూటింగ్ కూడా వచ్చే నెల మేలో ప్రారంభం కావాల్సి ఉంది. ఇది కూడా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లడం సందేహమేనని అన్నారు విజయ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">