యువ నటుడు విక్కీ కౌశల్.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నాడు. ఇతడు, బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్(Katrina Kaif) ప్రేమలో ఉన్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఓ చాట్ షోలో మాట్లాడాడు యువ నటుడు హర్ధవర్ధన్ కపూర్. అయితే ఇతడు వారి ప్రేమను ఇలా బహిర్గతం చేయడం పట్ల కత్రిన చాలా బాధపడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పకపోయినా.. నటి స్నేహితుడు ఒకరు వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"కత్రిన-విక్కీల ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడాల్సిన అవసరం హర్ధవర్ధన్కు లేదు. కత్రినకు అతడు అంతగా తెలియదు. ఒకవేళ తెలిసినా.. అతడు వ్యక్తిగత విషయాలు మాట్లాడే ముందు కత్రిన అనుమతి తీసుకోవాలి కదా. ఈ రిలేషన్షిప్ గురించి కత్రిన చాలా సీరియన్‌గా ఉందని చెప్పాడు. ఇప్పటికే ఆమె ప్రేమ(రణ్‌బీర్ కపూర్‌తో) విషయంలో దెబ్బతింది. అందుకే ఈ రిలేషన్‌ను అందరికీ దూరంగా ఉంచాలని అనుకుంటోంది." -కత్రిన స్నేహితుడు
ఇటీవల ఓ చాట్ షోలో పాల్గొన్న హర్షవర్ధన్.. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్షిప్ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు. దీంతో విక్కీ, కత్రినా డేటింగ్లో ఉన్నట్లు స్పష్టమైంది!.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">