విక్టరీ వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో నటించిన కత్రినా కైఫ్.. చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రౌడీహీరో విజయ్ దేవరకొండతో ఆమె కలిసి పనిచేయనుందని సమాచారం. అయితే అది ఏ సినిమా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం 'లైగర్'తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకదానిలో కత్రినా కైఫ్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఆమె ఏ ప్రాజెక్టులో భాగమవుతుందో?
