ETV Bharat / sitara

సెలబ్రిటీల పెళ్లి ఫొటోలకు కోట్లలో డీల్.. ఇది నయా ట్రెండ్ గురూ! - preity zinta gene goodenough wedding photos

తమ పెళ్లిపై ఉన్న హైప్​ను పలువురు సెలబ్రిటీలు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ జాబితాలో విక్కీ- కత్రినా జంట కూడా ఇప్పుడు చేరింది. కానీ వీరి కంటే ముందు చాలామంది ఇలా చేశారు. అందులోని కొందరు సెలబ్రిటీల గురించే ఈ స్టోరీ.

Katrina Kaif vicky kaushal wedding
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్
author img

By

Published : Dec 9, 2021, 4:51 PM IST

బాలీవుడ్ లవ్​బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి.. రాజస్థాన్​లోని ఓ కోటలో అంగరంగ వైభవంగా జరగనుంది. చాలా తక్కువ మంది అతిథులకు మాత్రమే ఎంట్రీ. ఫొటోలు, వీడియోలు తీయకూడదు. ఇలా చాలా నిబంధనలు పెట్టారు. అలానే పెళ్లికి భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని, పెళ్లి మొత్తం వీడియోను ఓ ఓటీటీ సంస్థకు కోట్ల రూపాయలకు అమ్మేశారని.. ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు.

అయితే స్టార్స్​ పెళ్లి ఫొటోలు భారీ మొత్తానికి అమ్మేయడం విక్కీ-కత్రినా పెళ్లితో ఏం మొదలుకాలేదు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా జరిగింది. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? వారి పెళ్లి ఫొటోలు ఎంత మొత్తానికి అమ్మేశారు?

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్

తమ పెళ్లి చుట్టూ ఏర్పడిన హైప్​ను క్యాష్​ చేసుకోవాలని విక్కీ-కత్రినా జోడీ భావించింది. అందులో భాగంగానే పెళ్లి ఫొటోలను భారీ మొత్తానికి ఓ మ్యాగజైన్​కు విక్రయించాలని నిర్ణయించుకుంది.

katrina kaif wedding
కత్రినా కైఫ్

అలానే పెళ్లి వీడియో ఫుటేజీ మొత్తానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు దాదాపు రూ.80 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్కీ-కత్రినా అభిమానులుకు ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్

2018లో రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో ప్రియాంక-నిక్ పెళ్లి చేసుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 'నో ఫోన్ నో ఫొటోస్' నిబంధన పెట్టారు. అలానే తమ మ్యారేజ్​ ఫొటోలను దాదాపు రూ.18 కోట్ల మొత్తానికి ఓ మ్యాగజైన్​కు అమ్మేశారట. బాలీవుడ్​లో అప్పట్లో ఇదే అత్యంత ఖరీదైన డీల్ కావడం విశేషం.

priyanka chopra nick jonas
ప్రియాంక నిక్ జొనాస్

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

కోహ్లీ-అనుష్క.. 2017 ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహంపై హైప్​ను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని ఈ జంట భావించింది. ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి ఫొటోలు అన్నింటిని ఓ మ్యాగజైన్​కు విక్రయించింది. తద్వారా వచ్చి మొత్తాన్ని తమ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేశారు విరాట్-అనుష్క.

kohli anushka wedding
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

ప్రీతి జింతా-జీన్ గుడ్​ఇనఫ్​

2016 లాస్ ఏంజెల్స్​లో జీన్​ గుడ్​ఇనఫ్​ను పెళ్లి చేసుకుంది నటి ప్రీతి జింతా. అయితే తమ పెళ్లి ద్వారా సమాజానికి మేలు చేయాలని భావించింది. అందులో భాగంగానే పెళ్లి ఫొటోలను ఓ మంచి పని కోసం ఉపయోగించింది. వాటిని వేలంలో ఉంచి, తద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల చదువు, వృద్ధాశ్రమాలను నడుపుతున్న ఓ ఫౌండేషన్​కు ఇచ్చేసింది.

preity zinta gene goodenough wedding
ప్రీతి జింతా పెళ్లి ఫొటోలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.