చాలా కాలం నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రొమన్ పొలన్స్కి, ఉడ్ అలెన్ గురించి మాట్లాడింది టైటానిక్ భామ కేట్ విన్స్లెట్. వారితో కలిసి పనిచేయడంపై విచారణ వ్యక్తం చేసింది. ఇంతకాలంగా సమాజంలో వారు గొప్ప వ్యక్తులుగా చలామణీ అవడం అవమానకరమని చెప్పింది. వారి చెత్త చరిత్ర తెలియక.. వాళ్ల సినిమాల్లో నటించి తాను తప్పు చేసినట్టుగా భావిస్తున్నట్లు వెల్లడించింది.
2011లో పొలన్స్కితో దర్శకత్వంలో 'కార్నేజ్', 2017లో అలెన్ దర్శకత్వంలో 'వండర్ వీల్' సినిమాలో నటించింది కేట్.
2017లో ప్రారంభమైన 'మీటూ' ఉద్యమంలో భాగంగా దర్శకులు అలెన్, పొలన్స్కితో పాటు నిర్మాత హర్వే వెయిన్స్టెయిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హర్వే జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు.
ఇదీ చూడండి గుండు లుక్తో ఇన్స్టాలో దూసుకెళ్తోన్న చిరు