ETV Bharat / sitara

అవార్డులన్నీ అందుకున్న అరుదైన కళాకారిణి కేట్! - kate winslet news

'టైటానిక్' ఫేమ్ కేట్ విన్​స్లెట్ పుట్టినరోజు నేడు(అక్టోబరు 5). ఈ సందర్భంగా ఆమె జీవిత, సినీ విశేషాలు మీకోసం.

kate winslet birthday story
'టైటానిక్' ఫేమ్ కేట్ విన్​స్లెట్
author img

By

Published : Oct 5, 2020, 2:18 PM IST

జేమ్స్‌ కామెరూన్‌ 'టైటానిక్‌'ను తల్చుకోగానే స్ఫురించే అందాల తార కేట్‌ విన్‌స్లెట్‌. ఆ సినిమాతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అమెరికా వినోద పరిశ్రమలో టీవీ, రికార్డింగ్, సినిమా, నాటక రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలకు ఇచ్చే ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులన్నింటినీ అందుకున్న అరుదైన కళాకారుల్లో కేట్ ఒకరు. వీటితో పాటు మూడు బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డులు, అనేక ప్రశంసలతో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే 'మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌' పురస్కారాన్ని అందుకున్న ఈ అందాల తార బాల్యం మాత్రం ఏమంత గొప్పగా సాగలేదు.

ఇంగ్లండ్‌లో 1975 అక్టోబర్‌ 5న పుట్టిన కేట్‌విన్‌స్లెట్‌ది ఒక విధంగా నట కుటుంబమనే చెప్పవచ్చు. అమ్మమ్మ, తాతయ్య నాటకరంగంలోనే ఉన్నారు. తండ్రి కూడా చిన్నా చితకా పాత్రలు వేసేవాడు. కేట్‌ అక్కలు అన్నా, బెత్‌లూ ఆ రంగంలోనే స్థిరపడ్డారు. అయితే బాల్యంలో కేట్‌ కుటుంబం ఆర్ధిక వనరులు అంతంతమాత్రమే. ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అందించే ఉచిత భోజనంతో కాలక్షేపం చేయాల్సిన రోజులు కేట్‌కు గుర్తున్నాయి. స్కూల్లో చదువుకునేప్పుడే అక్కలతో కలిసి ఐదేళ్ల వయసులోనే స్టేజి ఎక్కింది. పదకొండేళ్లకు యాక్టింగ్‌ స్కూలుకు ఎంపికైంది.

kate winslet birthday story
'టైటానిక్' ఫేమ్ కేట్ విన్​స్లెట్

ఓ పక్క వ్యాపార ప్రకటనలకు మోడలింగ్‌ చేస్తూ, పదహారేళ్లకల్లా టీవీలో మెరిసింది. 'హెవెన్లీ క్రియేచర్స్‌' (1994) సినిమాతో అరంగేట్రం చేసిన కేట్.. ఆపై 'సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ' (1995)తో బాఫ్తా అవార్డు అందుకుంది.

'టైటానిక్‌' (1997) సినిమాతో ఆమె స్టార్‌డమ్‌ అందుకుంది. తరువాత 'క్విల్స్‌', 'ఐరిస్‌', 'ఎటర్నల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ద స్పాట్‌లెస్‌ మైండ్‌', 'ఫైండింగ్‌ నెవెర్‌ లాండ్‌', 'లిటిల్‌ చిల్డన్ర్‌', 'రివల్యూషనరీ రోడ్‌' లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. 'ద రీడర్‌' (2008) సినిమాతో ఉత్తమ నటిగా బాఫ్తా, ఆస్కార్‌ అవార్డులు అందుకుంది. 2011లో 'కార్నేజ్‌', 2013లో 'మూవీ 43', 'లబోర్‌ డే' చిత్రాలతో మెప్పించింది.

'టైటానిక్‌' విజయం తర్వాత 1998లో, దర్శకుడు జిమ్‌ ఎడ్వర్డ్‌ ట్రిప్లీటన్‌ను పెళ్లి చేసుకుంది. మూడేళ్లు హాయిగా సాగిన వీరి కాపురం.. 2001లో తెగిపోయింది. తర్వాత ప్రముఖ దర్శక, నిర్మాత శామ్‌ మెండస్‌ను 2003లో వివాహమాడింది. 2011లో విడాకులు తీసుకున్నారు. ముచ్చటగా మూడోసారి ఎడ్వర్డ్‌ ఆబెల్‌ స్మిత్‌ను 2012 పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది.

ప్రస్తుతం జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అవతార్‌2'లో రోనాల్‌ పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్‌ కామెడీ చితరం 'అమ్మోనైటీ'తో పాటు ఇండియన్‌ పెయింట్‌బ్రెస్, ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ది ఫ్రెంచ్‌ డిస్పాచ్‌'లోనూ చేస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.