యువ నటుడు కార్తికేయ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సుకుమార్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించనున్నాడు సుకుమార్. ఓ కొత్త దర్శకుడితో ఈ మూవీని రూపొందిస్తారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
కార్తికేయ హీరోగా నటించిన 'చావు కబురు చల్లగా' మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. ఇదే కాకుండా తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న 'వాలిమై'లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు కార్తికేయ.