'రెమో' సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. ఇప్పుడాయన కథానాయకుడు కార్తితో తెరకెక్కించిన చిత్రం 'సుల్తాన్'. రష్మిక కథానాయికగా నటించింది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు దర్శకుడు బక్కియరాజ్.
- పూర్తి గ్రామీణ నేపథ్య కథతో రూపొందిన చిత్రమిది. తన స్వభావానికి ఏమాత్రం సంబంధం లేని వందమందితో కథానాయకుడు ఎలాంటి ప్రయాణం చేశాడన్నదే ఈ చిత్ర కథ.
- ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి, వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వందమందికీ హీరోకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఆసక్తికరాంశం. ఈ కథ తమిళంలో సేలంలో జరిగినట్లు చూపిస్తుండగా.. తెలుగులో అమరావతిలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంటుంది.
- ఈ చిత్రంలో కార్తి రోబోటిక్స్ ఇంజినీర్‌గా కనిపిస్తారు. ముంబయిలో ఉండే ఆయన ఓ చిన్న పల్లెటూరికి ఎందుకొస్తారు, ఆ ఊరి కోసం ఆయన చేసిన త్యాగం ఏమిటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
- సాధారణంగా కార్తి బౌండ్ స్క్రిప్ట్ వినకుండా ఏ నిర్ణయం తీసుకోరు. కానీ, నేను ఇరవై నిమిషాలు కథ వినిపించగానే.. 'నేను చేస్తున్నా' అని మాటిచ్చారు. అదే నా తొలి విజయం అనుకున్నా.
- ఈ చిత్రంతో రష్మిక తమిళ ప్రేక్షకులకు పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రష్మికకు వ్యవసాయ నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- ఇందులో చాలా మంది ప్రతినాయకులు ఉంటారు. అందులో అసలు విలన్ ఎవరనేది ప్రేక్షకులకు పజిల్.
- అవకాశం వస్తే తెలుగులోనూ సినిమా చేయాలని ఉంది. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో సినిమా చేయాలనుకుంటున్నా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: రంగుల హోలీ.. సినీతారల ఆనందాల హేళి