ETV Bharat / sitara

ఎన్‌ఐఏ అధికారిగా కార్తికేయ కొత్త చిత్రం - కార్తికేయ తాజా వార్తలు

యువ నటుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్య రవిచంద్రన్ హీరోయిన్​గా నటిస్తోంది.

Karthikeya new movie announced
ఎన్‌ఐఏ అధికారిగా కార్తికేయ
author img

By

Published : Sep 21, 2020, 8:12 AM IST

కార్తికేయ కథానాయకుడిగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామారెడ్డి నిర్మాత. తాన్య రవిచంద్రన్‌ కథానాయికగా నటిస్తోంది. సోమవారం కార్తికేయ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆదివారం ఈ సినిమా విశేషాల్ని పంచుకుంది చిత్రబృందం.

"ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో.. కార్తికేయ ఎన్‌.ఐ.ఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. కథ విన్న వెంటనే ఆయన సినిమా చేసేందుకు అంగీకరించడం సంతోషాన్నిచ్చింది. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషిస్తున్నారు" అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.