ETV Bharat / sitara

'సుల్తాన్' ఓటీటీ విడుదల తేదీ ఖరారు - ఏప్రిల్ 30 సుల్తాన్

కార్తి, రష్మిక ప్రధానపాత్రల్లో భాగ్యరాజ్ కణ్ణన్ తెరకెక్కించిన చిత్రం 'సుల్తాన్'. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం.

Sultan
సుల్తాన్
author img

By

Published : Apr 26, 2021, 5:09 PM IST

కార్తి, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం 'సుల్తాన్‌'. భాగ్యరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. థియేటర్లలో ఏప్రిల్‌ 2న విడుదలై అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో మంచి విజయం అందుకుంది. మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓటీటీ వేదికగా సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో ఏప్రిల్‌ 30 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు ట్వీట్ చేసింది ఆహా సంస్థ.

యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నెపోలియన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ మర్విన్‌, నేపథ్య సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.