ETV Bharat / sitara

ఖైదీ సీక్వెల్​కు లైన్​క్లియర్​.. 'రాకెట్రీ', 'లవ్​హాస్టల్'​ అప్డేట్స్​ - లవ్​ హాస్టల్​ ట్రైలర్​

Cinema updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో కార్తి 'ఖైదీ' సీక్వెల్​, మాధవన్​ 'రాకెట్రీ', 'లవ్​ హాస్టల్' చిత్రాల సంగతులు ఉన్నాయి.

khaidi 2
ఖైదీ 2
author img

By

Published : Feb 14, 2022, 8:34 PM IST

కార్తి కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులూ ఈ మూవీని ఆదరించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు అప్పట్లోనే వెల్లడించారు. అయితే, న్యాయపరమైన అంశాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ‘ఖైదీ’ సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో సీక్వెల్‌తో పాటు, హిందీలోనూ రీమేక్‌ చేయకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిత్ర బృందం ఆ ప్రయత్నాలను పక్కన పెట్టింది. తాజాగా ఇరు వర్గాల అభిప్రాయాలను విన్న కోర్టు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ‘ఖైదీ’ దర్శకుడి సొంత కథేననని స్పష్టం చేసింది. దీంతో రెండు అంశాల్లో చిత్ర బృందానికి ఊరట లభించింది. అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తున్న ఖైదీ రీమేక్‌ 'భూలా'తో పాటు, 'ఖైదీ2'ను పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఉత్కంఠగా 'లవ్‌ హాస్టల్‌' ట్రైలర్‌

Lovehostel trailer: బాలీవుడ్‌ నటులు సాన్యా మల్హోత్రా, విక్రాంత్‌ మెస్సీ, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్‌ హాస్టల్‌’. శంకర్‌ రమణ్‌ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 25న నేరుగా ఓటీటీ ‘జీ 5’ లో విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసింది. ప్రేమ సన్నివేశంతో ప్రారంభమైందీ ఈ ట్రైలర్‌. తమ ప్రేమను గెలిపించుకునేందుకు నాయకానాయికలు సొంతూరు వదిలివెళ్లపోవటం, వారిని పట్టుకునేందుకు పెద్దలు వెతకటం తదితర అంశాలతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, దృశ్యం ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

రాకెట్రీ రిలీజ్

Rocketry movie release date: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో పాన్‌ఇండియా చిత్రంగా రూపొందింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. జులై 1, 2022న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. సిమ్రన్‌ కథానాయిక. సామ్‌ సి.ఎస్‌ స్వరాలందిస్తున్నారు.

ఇదీ చూడండి: వాలంటైన్స్ డే స్పెషల్.. బాలయ్య ప్రేమ పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.