కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఫైట్ మాస్టర్ వివేక్(28) మృతి కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 'లవ్ యూ రచ్చు' చిత్ర షూటింగ్లో భాగంగా సోమవారం జోగినదొడ్డి ప్రాంతంలో స్టంట్ చేస్తుండగా విద్యుదాఘాతంతో వివేక్ మృతి చెందాడు.
ఈ కేసులో సినిమా దర్శకుడు శంకర్, నిర్మాత గురు దేశ్‌పాండే, నటుడు వినోద్ కుమార్, సినిమా ఇన్ఛార్జ్ ఫెర్నాండెజ్, క్రేన్ ఆపరేటర్ మాధవన్‌లపై బిదాడి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
త్వరలో ఆదేశాలు..
ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. అనుమతులు లేకుండా షూటింగ్‌ల్లో ఇలాంటి స్టంట్స్ చేయొద్దని, చిత్రీకరణ సమయాల్లో ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అనుమతులు లేకుండా ఎవరూ, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పారు.
2016లోనూ 'మాస్తి గుడి' సినిమా షూటింగ్లో ఇద్దరు స్టంట్‌మెన్ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి మరణించారు.
ఇదీ చదవండి: షూటింగ్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయం