ETV Bharat / sitara

Kareena kapoor: ఆ పాత్ర కోసం రూ.12 కోట్లు డిమాండ్! - Kareena Kapoor saif ali khan

రామాయణం ఆధారంగా తీస్తున్న సినిమాలో సీతగా నటించేందుకు భారీ రెమ్యునరేషన్​ డిమాండ్ చేసింది ప్రముఖ నటి కరీనా కపూర్. అయితే అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు సంశయిస్తున్నారు.

Kareena Kapoor Is Demanding Rs 12 Crore
కరీనా కపూర్
author img

By

Published : Jun 9, 2021, 2:29 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరో కరీనా కపూర్.. రామాయణంలోని సీత పాత్రలో నటించేందుకు ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్​ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అంత మొత్తం అడగానికి కారణం ఏంటి? ఓ సినిమాకు సాధారణంగా కరీనా ఎంత తీసుకుంటుంది?

ఇప్పటివరకు తీసినట్లు కాకుండా రామాయణాన్ని, సీతదేవి కోణం నుంచి (పాయింట్ ఆఫ్ వ్యూ) తెరకెక్కించేందుకు దర్శకుడు అలౌకిక్ దేశాయ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కరీనాను సంప్రదించగా, ఆమె రూ.12 కోట్లు డిమాండ్ చేసిందట.

Kareena Kapoor
కరీనా కపూర్

సాధారణంగా ఏ చిత్రం కోసమైనా సరే రూ.6-8 కోట్లు తీసుకునే ఈమె.. దాదాపు 8-10 నెలలు సీత పాత్ర కోసమే డేట్స్ కేటాయించాల్సి ఉంది. దీనితో పాటు మరే ప్రాజెక్టులు ఒప్పుకోకుండా దీనిపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. అందుకే ఇంత భారీ రెమ్యునరేషన్​ అడిగినట్లు తెలుస్తోంది.

అయితే కరీనా ఇంత మొత్తం అడుగుతుందని ఊహించని నిర్మాతలు.. ఈమె బదులు వేరే హీరోయిన్​ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.