ETV Bharat / sitara

'సినీ మాఫియాలో ప్రధాన నిందితుడు కరణ్​ జోహార్​' - కంగనా రనౌత్​ వార్తలు

మూవీ మాఫియాకు ప్రధాన కారకుడు దర్శకనిర్మాత కరణ్​ జోహార్​ అని నటి కంగనా రనౌత్​ ఆరోపించింది. ఎదగాలని వచ్చిన ఎంతోమంది యువతీయువకుల జీవితాలను నీరుగార్చాడని చెప్పింది.

Karan Johar the main culprit of movie mafia: Kangana Ranaut
మూవీ మాఫియాలో ప్రధాన నిందితుడు కరణ్​ జోహార్​
author img

By

Published : Sep 2, 2020, 8:16 AM IST

బాలీవుడ్​ మూవీ మాఫియాలో ప్రధాన నిందితుడు దర్శకనిర్మాత కరణ్​ జోహార్​ అని ఆరోపించింది నటి కంగనా రనౌత్​. సినీనేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది జీవితాలను నీరుగారుస్తున్నాడని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్​ చేస్తూ పోస్ట్​ చేసింది.

  • Karan Johar the main culprit of movie mafia! @PMOIndia even after ruining so many lives and careers he is roaming free no action taken against him, is there any hope for us? After all is settled he and his gang of hyenas will come for me #ReportForSSR https://t.co/qvtv0EnkR2

    — Kangana Ranaut (@KanganaTeam) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మూవీ మాఫియాలో ప్రధాన నిందితుడు కరణ్​ జోహార్​. ఎంతోమంది కెరీర్​ను నీరుగార్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాకు ఏదైనా చివరి ఆశ ఉందా? ఇది అంతా సద్దుమణిగాక అతని హైనాల గ్యాంగ్​ నా కోసం వస్తుంది"

-కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

బాలీవుడ్​లో మూవీ మాఫియా ఆగడాల గురించి సుశాంత్​ జిమ్​ పార్ట్​నర్​ ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్​ చేస్తూ నటి కంగనా రనౌత్ ఇలా ట్వీట్ చేసింది​. చిత్రపరిశ్రమలో సుశాంత్​కు కరణ్ అవకాశాలు రానివ్వలేదని​ అతడి జిమ్​ పార్ట్​నర్​ ఆరోపించాడు.

సుశాంత్​ మృతి తర్వాత బాలీవుడ్​లోని బంధుప్రీతి, స్వాభిమానాల గురించి చర్చకు తెరలేపింది నటి కంగనా రనౌత్​. బాలీవుడ్​లో ప్రముఖుల వారసులను తప్ప బయటి వారిని పరిశ్రమలో ఎదగనీయడం లేదని చేస్తున్నారని ఆరోపించింది.

99 శాతం మంది డ్రగ్స్​ తీసుకుంటారు!

బాలీవుడ్​లో ఎక్కువమంది ప్రముఖులు డ్రగ్స్​ ఉపయోగించేవారేనని గతవారం ట్వీట్​ చేసింది కంగన. ఇప్పటికిప్పుడు నార్కోటిక్​ పరీక్షలు నిర్వహిస్తే చాలామంది డ్రగ్స్​ వాడేవాళ్లు బయటపడతారని తెలిపింది. ఇండస్ట్రీలో దాదాపుగా 99 శాతం మంది మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని పేర్కొంది. స్వచ్ఛ భారత్​ పథకంలో భాగంగా బాలీవుడ్​లో పేరుకుపోయిన మురికినంతా తీసివేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్​ చేస్తూ ట్విట్టర్​లో కోరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.