ETV Bharat / sitara

కరోనాపై పోరుకు బాలీవుడ్​ స్టార్స్​  'లైవ్​ షో'

author img

By

Published : May 27, 2020, 5:45 AM IST

కరోనా బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా విరాళాలు సేకరించేందుకు బాలీవుడ్​ తారలు.. 'వన్​ హ్యూమానిటీ లైవ్'​ అనే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 150 స్టార్​ సెలబ్రిటీలు పాల్గొనే ఈ కార్యక్రమం మే 29న జరగనుంది.

Karan Johar,
బాలీవుడ్​ స్టార్​

కరోనాపై పోరుకు సినీ సెలబ్రిటీలు నిత్యం ఏదో ఒక కొత్తదనంతో ముందుకు వస్తూనే ఉన్నారు. కొంతమంది విరాళాలు అందిస్తుండగా.. మరికొంతమంది ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా కరోనా బాధితులను ఆదుకోవడమే లక్ష్యంగా విరాళాలు సేకరించేందుకు 'వన్​ హ్యుమానిటీ లైవ్​'​ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని 24 గంటల పాటు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 మంది స్టార్​ సెలబ్రిటీలతో.. మార్చి 29న ఈ కార్యక్రమం జరగనుంది.

ఇందులో బాలీవుడ్​ నుంచి కరన్​ జోహార్​, సోనమ్​ కపూర్​, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాజా కుమారి, మల్లికా డ్యూ, మహిరా ఖాన్​, అలీ జాఫర్​ తదితర బాలీవుడ్​ తారలు భాగస్వాములయ్యారు. దీన్ని గ్లోబల్​ గిఫ్ట్​ ఫౌండేషన్​ భాగస్వామ్యంతో కాన్ట్సిలేషన్​, ఐటీవీ లైవ్​ సంస్థ​ వారు నిర్వహించనున్నారు.

కరోనా పట్ల ప్రజల్లో ఐకమత్యం, ధైర్యం వంటివి పెంపొందించడమే ఈ కార్యక్రమ మరొక ముఖ్య ఉద్దేశం. దీన్ని యూట్యూబ్​, ఫేస్​బుక్​, ఐజీటీవీ, టిక్​టాక్​ వంటి మాధ్యమాలు.. ఈ కార్యక్రమాన్ని 24 గంటలపాటు లైవ్​ ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ తర్వాత రొమాన్స్ సీన్లకు దూరం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.