ETV Bharat / sitara

మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ కమెడియన్ భార్య - కపిల్ శర్మ

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు కపిల్.

Kapil Sharma And Ginni Chatrath bleesed with baby boy
స్టార్ కమెడియన్​కు మగబిడ్డ
author img

By

Published : Feb 1, 2021, 9:15 AM IST

Updated : Feb 1, 2021, 11:54 AM IST

బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్​ శర్మ.. మరోసారి తండ్రయ్యాడు. 2019 డిసెంబర్​లో పండంటి పాపకు జన్మనిచ్చింది ఇతడి భార్య గిన్నీ ఛత్రత్. తాజాగా నేడు ఉదయం వీరికి బాబు జన్మించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు కపిల్.

  • Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏

    — Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నమస్కారం. ఈరోజు ఉదయం నా భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవుడి దయ వల్ల బేబీ, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం, ప్రార్థనలకు కృతజ్ఞతలు"

-కపిల్​ శర్మ, కమెడియన్

'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోతో ప్రఖ్యాతి చెందాడు కపిల్ శర్మ. ఓ షోకు అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న వ్యక్తిగానూ రికార్డు సృష్టించాడు. ఇదే కాకుండా బాలీవుడ్​లో పలు సినిమాల్లో నటించడమే కాకుండా, 'సన్నాఫ్ మంజీత్ సింగ్' నిర్మాతగానూ మారాడు.

వీరిద్దరికీ 2019 డిసెంబర్​లో పాప జన్మించింది. గతేడాది ఆ పాప మొదటి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కపిల్.

Last Updated : Feb 1, 2021, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.