ETV Bharat / sitara

ఆదివారం పునీత్​ రాజ్​కుమార్​ అంత్యక్రియలు

కన్నడ స్టార్ హీరో పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. ఆదివారం(అక్టోబర్​ 31) జరగనున్నాయని తెలిపారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. పునీత్​ కూతురు అమెరికా నుంచి దిల్లీకి చేరుకుందని, సాయంత్రానికి బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు.

puneeth rajkumar
పునీత్​ రాజ్​కుమార్​
author img

By

Published : Oct 30, 2021, 3:11 PM IST

Updated : Oct 30, 2021, 4:21 PM IST

గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు.. ఆదివారం(అక్టోబర్​ 31) జరగనున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు.

పునీత్​ కూతురు అమెరికా నుంచి దిల్లీకి చేరుకున్నట్లు బొమ్మై వెల్లడించారు. ఆమె బెంగళూరు చేరుకునేసరికి సాయంత్రం 7 గంటలు అవుతుందని పేర్కొన్నారు. తమ ఆచారం ప్రకారం సూర్యాస్తమయంలో అంత్యక్రియలు నిర్వహించరని.. అందుకే ఆదివారం జరుపుతారని చెప్పుకొచ్చారు.

శుక్రవారం(అక్టోబర్​ 29) ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచారు.

ఇదీ చూడండి: పునీత్ పార్థివ దేహం వద్ద ఎన్టీఆర్​ కన్నీటి పర్యంతం

Last Updated : Oct 30, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.