ETV Bharat / sitara

'గని' చిత్రంలో అతిథిగా ఉపేంద్ర - గని చిత్రంలో ఉపేంద్ర

మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్​ నటిస్తోన్న కొత్త చిత్రం 'గని'. ఇందులో విలక్షణ నటుడు ఉపేంద్ర అతిథిపాత్ర పోషించనున్నారు. ఫిబ్రవరిలో జరగబోయ్యే ఈ చిత్ర షెడ్యూల్​లో ఆయన పాల్గొననున్నారు.

kannada actor upendra doing cameo in Varun tej's Ghani movie
వరుణ్​తేజ్​ 'గని' సినిమాలో అతిథిగా ఉపేంద్ర
author img

By

Published : Jan 31, 2021, 6:16 PM IST

కన్నడ నటుడు ఉపేంద్ర నటన తెలుగు ప్రేక్షకులకు కొత్తేంకాదు. ఆయన నటించిన 'రా', 'ఏ', 'కన్యాదానం' లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రం 'గని'తో.. తన నటనతో మరోసారి మెప్పించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల్లో ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడారు.

"నేను ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నాను. కొంతకాలం తర్వాత తెలుగులో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక ప్రత్యేక పాత్రగా చెప్పుకోవచ్చు. వచ్చే నెల 12న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నా."

- ఉపేంద్ర, కథానాయకుడు

ఉపేంద్ర ప్రస్తుతం.. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కబ్జ'లో నటిస్తున్నారు. లగడపాటి శ్రీధర్‌ సమర్పకుడు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌.చంద్రశేఖర్, రాజ్‌ప్రభాకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1980ల నేపథ్యంలో సాగే ఒక మాఫియా నాయకుడి కథ ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జాకీ ష్రాఫ్‌, కోట శ్రీనివాసరావు, కబీర్ దుహాన్ సింగ్, జయ ప్రకాష్, కాట్ రాజు, సుబ్బరాజు, అవినాష్, ఎమ్‌.కామరాజ్ తదితరులు నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆ హీరోల గురించి సాయి పల్లవి ఏమందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.