బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డేను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఆరోపణలున్న నేపథ్యంలో బెంగళూరులోని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే?
ముంబయిలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బాడీగార్డ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి.. ఓ బ్యూటీషియన్‌పై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'గత ఎనిమిదేళ్లుగా ఆమెతో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. తనపై అత్యాచారం చేశాడు.'
ఆ తర్వాత పెళ్లి గురించి ఆమె ప్రస్తావించగా.. కుమార్ తిరస్కరించాడు. దీంతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. ఐపీసీ 376, 377, 420 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఆ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ముంబయి పోలీసులు విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ చూడండి: దెబ్బ మీద దెబ్బ.. కంగనకు ఇన్స్టాగ్రామ్ ఝలక్