మహేశ్‌బాబు హీరోగా వచ్చిన 'పోకిరి'... బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ పేరు మార్మోగిపోయింది. హీరోయిన్గా నటించిన గోవా బ్యూటీ ఇలియానా అభిమానుల్ని తన నడుముతో కట్టిపడేసింది. అయితే కథానాయిక పాత్ర కోసం ఆమె తొలి ఎంపిక కాదు. ఆ అవకాశం బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను మొదట వరించింది. కానీ ఆ ఛాన్స్ వద్దనుకుంది.
కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా.. ఒకేసారి 'ఫైర్ బ్రాండ్', 'పోకిరి' సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఈ రెండింటి షూటింగ్ ఒకే సమయంలో ప్రారంభమవుతుండటం వల్ల బాలీవుడ్లో మొదటగా నటించేందుకు సిద్ధమైంది. అక్కడే నటిగా స్థిరపడిపోయింది. తర్వాత ఆమె స్థానంలో ఇలియానాను తీసుకున్నాడు పూరీ.
కొన్నాళ్ల తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఏక్ నిరంజన్'లో ప్రభాస్ సరసన నటించింది కంగనా. ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇది సంగతి: రణ్‌బీర్‌కు కంగనా చురకలు