కూల్చివేసిన భవనాన్ని తిరిగి కట్టుకునేంత స్థోమత తనకు లేదని చెప్పింది నటి కంగనా రనౌత్. కాబట్టి ఆ శిథిలాల మధ్యే పనిచేస్తానని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ముంబయిలోని ఈమె కార్యాలయాన్ని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం కొంతమేర కూల్చివేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే Kangana Vs Uddhav అని ట్వీట్ కూడా పెట్టింది.
-
I had my office opening on 15th Jan, shortly after corona hit us, like most of us I haven’t worked ever since, don’t have money to renovate it, I will work from those ruins keep that office ravaged as a symbol of a woman’s will that dared to rise in this world #KanganaVsUddhav https://t.co/98VnFANVsu
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I had my office opening on 15th Jan, shortly after corona hit us, like most of us I haven’t worked ever since, don’t have money to renovate it, I will work from those ruins keep that office ravaged as a symbol of a woman’s will that dared to rise in this world #KanganaVsUddhav https://t.co/98VnFANVsu
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020I had my office opening on 15th Jan, shortly after corona hit us, like most of us I haven’t worked ever since, don’t have money to renovate it, I will work from those ruins keep that office ravaged as a symbol of a woman’s will that dared to rise in this world #KanganaVsUddhav https://t.co/98VnFANVsu
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020
'ఈ ఏడాది జనవరి 15న ముంబయిలో నా కార్యాలయాన్ని ఆరంభించాను. తర్వాత కొంత కాలానికే కరోనా వల్ల అందరిలాగానే నేను కూడా వృత్తిపరంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు ఈ ధ్వంసమైన భవనాన్ని తిరిగి చక్కదిద్దడానికి నా దగ్గర డబ్బుల్లేవు. కాబట్టి నేను ఈ శిథిలాల నుంచే పని చేస్తాను. ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలనుకునే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుంది' -కంగన రనౌత్, ప్రముఖ కథానాయిక
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మృతి తర్వాత హిందీ చిత్రసీమలోని పెద్దలపై కంగన విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఆమె ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. దీంతో శివసేన పార్టీ, కంగన మధ్య మాటల యుద్ధానికి తెరలేసింది. ఇదే సమయంలో ముంబయిలోని కంగన కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ, బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించగా.. ఆ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.
ఇదీ చదవండి: