ETV Bharat / sitara

Kangana: నేను తప్ప మరెవ్వరూ డైరెక్ట్​ చేయలేరు! - కంగన ఇన్​స్టాగ్రామ్​

వివాదాస్పద నటి కంగనా రనౌత్​(Kangana Ranaut) మరోసారి మెగాఫోన్​ చేత పట్టనుంది. గతంలో 'మణికర్ణిక'లోని కొన్ని సన్నివేశాలకు దర్శకత్వ బాధ్యత చేపట్టిన ఆమె.. ఇప్పుడు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) కథ ఆధారంగా 'ఎమర్జెన్సీ'(Emergency Movie) అనే చిత్రాన్ని రూపొందించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్​ వర్క్​ ఇప్పటికే మొదలుపెట్టేశారు.

Kangana Ranaut to direct Indira Gandhi film Emergency
Kangana: నేను తప్ప మరెవ్వరూ డైరెక్ట్​ చేయలేరు!
author img

By

Published : Jun 24, 2021, 10:02 PM IST

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్​ (Kangana) మరోసారి మెగాఫోన్‌ పట్టనుంది. గతంలో 'మణికర్ణిక' (Manikarnika) చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందామె. ఇప్పుడు ఆమె డైరెక్షన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ (Indira Gandhi) కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. దర్శకత్వంతో పాటు ఇందిరా గాంధీ పాత్రను కంగన పోషించనున్నట్లు తెలుస్తోంది.

'ఎమర్జెన్సీ' (Emergency Movie) పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కంగన రనౌత్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటికే చిత్ర నిర్మాణ పనులను కూడా ప్రారంభించిందామె. ఈ సినిమాను మరెవరూ తనకంటే గొప్పగా డైరెక్ట్‌ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. డైరెక్టర్‌గా మారే క్రమంలో నటిగా కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వచ్చినా.. వాటిని పట్టించుకోనని స్పష్టం చేసింది.

"దర్శకురాలిగా టోపీ మళ్లీ ధరించడం ఆనందంగా ఉంది. 'ఎమర్జెన్సీ' కోసం ఏడాది నుంచి పని చేస్తున్నాను. ఈ సినిమాకు నాకంటే బాగా ఎవ్వరూ దర్శకత్వం చేయలేరని భావిస్తున్నాను. రచయిత రితేష్ షా కథ అందిస్తున్నారు. ఈ సినిమా తీసే క్రమంలో నటిగా కొన్నింటిని త్యాగం చేయాల్సి వస్తోంది. అయినా అవన్నీ పట్టించుకోను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం కానుంది. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను."

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత పాత్రలో కంగన నటించిన 'తలైవి' (Thalaivi) విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు మరో చిత్రం 'తేజస్‌' (Tejas)లో ఆమె ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా నటిస్తుంది. అంతేకాదు.. 'మణికర్ణిక రిటర్న్స్‌' (Manikarnika Returns) పేరుతో రానున్న చిత్రంలో కంగన మరోసారి ఝాన్సీరాణిగా కనిపించనుంది.

ఇన్​స్టాగ్రామ్​ వివాదం

కంగనా రనౌత్​.. ఇటీవలే తన ఇన్​స్టా ఖాతాలో రెండు హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ రెండింటికీ రెండు వేర్వేరు క్యాప్షన్​లు ఇచ్చింది. మొదటి ఫొటోకు 'హాట్ సంఘీ' క్యాప్షన్​ పెట్టగా.. రెండో చిత్రానికి 'లిబ్రస్: సంఘీ మహిళా? కాదా?, - నేను: నా బీర్ పట్టుకో (బీర్ ఎమోజీ)' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇలా తన మాటలూ, చేతలతో చాలాసార్లు విమర్శలకు గురైంది కంగన. ఇదే కారణంగా గతంలో ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది ట్విట్టర్. అయినా సోషల్ మీడియాలో తన వివాదాలను కొనసాగిస్తూనే ఉందీ నటి.

ఇదీ చూడండి.. అత్యాచారం కేసులో కంగన బాడీగార్డ్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.