తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut). తన మాటలూ, చేతలతో చాలాసార్లు విమర్శలకూ గురైంది. ఈ కారణంగానే ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది ట్విట్టర్. అయినా సోషల్ మీడియాలో తన వివాదాలను కొనసాగిస్తూనే ఉందీ నటి. తాజాగా ఇన్స్టాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి.
తన ఇన్స్టా ఖాతాలో రెండు హాట్ ఫొటోలను షేర్ చేసింది కంగన. ఈ రెండింటికీ రెండు వేర్వేరు క్యాప్షన్లు ఇచ్చింది. మొదటి దానికి 'హాట్ సంఘీ' అని, రెండో దానికి 'లిబ్రస్: సంఘీ మహిళా?కాదా?,-నేను: నా బీర్ పట్టుకో (బీర్ ఎమోజీ)' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
కరోనా వైరస్ బారినపడిన తర్వాత కోలుకున్న కంగన ప్రస్తుతం మనాలిలోని తన ఇంట్లో ఉంటోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ నటి షూటింగ్ల కోసం ఎదురుచూస్తోంది.