బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో ప్రధాన పాత్ర పోషిస్తోందీ అమ్మడు. ఈ చిత్రం కోసం భరతనాట్యంలోనూ తర్ఫీదు పొందుతోంది. శనివారం డ్యాన్స్ సాధన చేస్తున్న సందర్భంగా తీసుకున్న చిత్రాలను అభిమానులతో పంచుకుంది కంగనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"జయలలిత బయోపిక్ కోసం భరతనాట్యం నేర్చుకుంటున్న కంగనా రనౌత్. కచ్చితత్వం కోసం సాధన చేస్తోంది" అని ఫొటోలు ట్విట్టర్ వేదికగా పంచుకుంది టీమ్ కంగనా రనౌత్.
ఈ సినిమా కోసం ఇటీవలే లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ ప్రోస్తటిక్ మేకప్ ఆర్టిస్ట్.. జాసన్ కోలిన్స్ వద్ద కొలతలు ఇచ్చింది. ఆమె మైనంతో నింపబడిన చిత్రాలను అభిమానులతో పంచుకుంది.
'తలైవి' సినిమా కోసం తమిళ పాఠాలు కూడా నేర్చుకుంది కంగనా రనౌత్ . ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను 'జయ' టైటిల్‌తో విడుదల చేయనుంది చిత్రబృందం. 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి విష్ణు ఇందూరి, శైలేష్ నిర్మాతలు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.