తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ప్రముఖ కథానాయకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ ముఖ్య పాత్ర పోషించారు! ఈ నేపథ్యంలోనే ఆయన 104వ జయంతి సందర్భంగా 'తలైవి' నుంచి స్పెషల్ వీడియోను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఎంజీఆర్.. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని.. నాయకురాలు(జయలలిత) వెనుక ఉన్న లెజండ్(ఎంజీఆర్) ఆయనేనని వీడియోలో చిత్రబృందం పేర్కొంది.
జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'తలైవి' చిత్రానికి ఏ.ఎల్.విజయ్ దర్శకుడు. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్‌గా, ప్రకాశ్‌రాజ్ కరుణానిధిగా కనిపించనున్నారు. పూర్ణ, భాగ్యశ్రీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి: అతడిని కొట్టి, తిట్టిన నటుడు మహేశ్ మంజ్రేకర్