ETV Bharat / sitara

Kangana: 'తలైవి' విడుదలపై హీరోయిన్​ క్లారిటీ - తలైవి ఓటీటీ రిలీజ్​

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా రూపొందిన పాన్​ఇండియా చిత్రం 'తలైవి'(Thalaivi). బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ (Kangana Ranaut) ప్రధానపాత్ర పోషించింది. ఈ ఏడాది సమ్మర్​లో థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రం కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నటి కంగన స్పందించింది.

Kangana Ranaut Gives Update On Release Date Of 'Thalaivi'
Kangana: 'తలైవి' విడుదలపై హీరోయిన్​ క్లారిటీ
author img

By

Published : Jul 14, 2021, 6:48 AM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut) ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'తలైవి'(Thalaivi). నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించింది కంగన.

"ఇప్పటి వరకు తలైవి చిత్ర విడుదల తేదీ ఖరారు కాలేదు. అవాస్తవాల్ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం."

- కంగనా రనౌత్​, బాలీవుడ్ నటి

ఈ సినిమాలో అరవింద స్వామి, ప్రకాశ్​ రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్​, ఛాయాగ్రహణం: విశాల్‌ విఠల్‌.

ఇదీ చూడండి.. Tanikella Bharani: రంగస్థలం నుంచి రంగుల ప్రపంచం దాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.