చిత్రీకరణ సమయంలో నటీనటులు కొన్నిసార్లు టేకుల మీద టేకుల తీసుకుంటూ ఉంటారు. వీరే కాకుండా దర్శకుడూ.. ఒక సన్నివేశం తాను అనుకున్న విధంగా వచ్చే వరకూ పాత్రధారులతో చేయిస్తూనే ఉంటారు. అయితే కొన్ని సీన్ల విషయంలో మాత్రం 2,3 టేక్లతో సరిపెట్టేస్తుంటారు. అవి సాధారణంగా బెడ్‌రూమ్ దృశ్యాలు, ముద్దు సన్నివేశాల్లాంటివి అయి ఉంటాయి. కానీ 'కాంచి' అనే బాలీవుడ్ సినిమాలోని ఓ ముద్దు సీన్ కోసం ఏకంగా 37 టేక్స్ తీసుకున్నారట. ఇంతకీ ఆ కథేంటీ?
'కాంచి' తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ మాత్రం తాను ఏ దశలోనూ రాజీపడను అన్నట్లుగా ఈ సినిమాలోని ఓ సన్నివేశం తీశారు. కార్తిక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి ఇందులో హీరో హీరోయిన్లు. చిత్రంలోని ఓ చుంబన దృశ్యాన్ని చిత్రీకరించేటపుడు వీరిద్దరూ కాస్త బిడియపడ్డారు. సరిగా రాలేదని భావించిన దర్శకుడు.. కట్ చెప్పేసి మళ్లీ ముద్దుపెట్టుకోమన్నారట. అలా కార్తిక్, మిస్తీల సన్నివేశాన్ని మొత్తం 37 టేకులు తీసుకున్న తర్వాతగానీ సుభాష్ అనుకున్న విధంగా ముద్దు రాలేదట. అంతసేపు ఆ సన్నివేశాన్ని చూసిన చిత్రీకరణ బృందం రకరకాల జోకులు వేసుకున్నారట.
ఇది చదవండి: వెండితెరపై తొలి ముద్దు సన్నివేశం తెరకెక్కించింది అప్పుడే..!