"పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు. డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి" అంటున్నారు నటుడు సునీల్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కనబడుటలేదు'. ఎం.బాలరాజు దర్శకుడు. ఎస్.ఎస్.ఫిల్మ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్, హిమజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నటి శ్రీదివ్య తాజాగా విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.
మాస్క్ ధరించిన ఓ అజ్ఞాత వ్యక్తి సిటీలో వరుస హత్యలకు చేస్తుండటాన్ని ఈ టీజర్‌లో చూపించారు. ఆ హత్య కేసుల్ని ఛేదించే డిటెక్టివ్‌గా సునీల్ చూపించారు. మరి ఆ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరు? సునీల్ తన తెలివితేటలతో ఆ నేరస్థుడ్ని ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో ఆయనకెదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథాంశం. ప్రతి మనిషికీ రెండు ముఖాలు ఉంటాయని, బయటకు కనిపించేదాన్ని మనం నమ్ముతామని, రెండోదాన్ని ఎవరూ గుర్తించలేరంటూ టీజర్ ద్వారా తెలియజేశారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">