విలక్షణ నటుడు కమల్ హాసన్ తన పుట్టినరోజున అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు. కమల్ నటించిన కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ బాణీలు సమకూరుస్తున్నారు. శనివారం సాయంత్రం విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి 'విక్రమ్' అనే టైటిల్ ఖరారు చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'విశ్వరూపం 2' తర్వాత కమల్ 'భారతీయుడు 2'కు సంతకం చేశారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లు జరిగింది. లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణను ఆపారు. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు చివర్లో తిరిగి షూటింగ్ ఆరంభించనున్నట్లు తెలుస్తోంది.