'విజేత' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణ్ దేవ్. దాంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యారు. రమణ్ తేజ్ దర్శకత్వంలో ఆయన నటించిన 'కిన్నెరసాని' త్వరలోనే విడుదల కానుంది. 'సూపర్ మచ్చి' అని ఇంకో చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. ఇవి లైన్లో ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారాయన. ఎం. కుమారస్వామి నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు.
ఎంపీ.ఆర్ట్స్ పతాకంపై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా గురువారం ప్రారంభమైంది. కూకట్‌పల్లిలోని తులసి వనం వేంకటేశ్వర స్వామి ఆలయం ఈ కార్యక్రమానికి వేదికైంది. ‘ఇది పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అక్టోబరు చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.
ఇవీ చదవండి: