హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే త్వరలో ఆమె సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుందనే వార్త ఇటీవల బయటకొచ్చింది. నటనకు వీడ్కోలు పలికిన తర్వాత భర్తతో కలిసి బిజినెస్ చూసుకుంటుందని అని చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనే దానిపై ఆమెనే స్పందించాల్సి ఉంది.
తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబరులో పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత కొన్నిరోజులకే 'ఆచార్య' సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఆరు సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తిచేసినా సరే 2022 పూర్తయిపోతుంది. అయితే కెరీర్‌కు టాటా చెప్పే విషయమై గతంలోనూ ఇలానే వార్తల వచ్చినప్పుడు ఈ ముద్దుగుమ్మ మాట్లాడింది.
ప్రస్తుతం తనకు కుటుంబం నుంచి పూర్తి సహకారముందని, తన భర్త చెప్పినప్పుడు నటించడం ఆపేస్తానని అప్పుడు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: