నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఆదివారం దసరా పండగ సందర్భంగా కాబోయే తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు కాజల్. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
కాజల్, గౌతమ్ నివాసాల్లో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కుటుంబం, దగ్గర బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.