ETV Bharat / sitara

ఆ రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయ్​: కాజల్​ - Kajal Agarwal quarantine

కరోనా కారణంగా వచ్చిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు సెలిబ్రిటీలు. అలాగే హీరోయిన్ కాజల్ కూడా ఇంటివద్ద ఫ్యామిలీతో టీవీ షోలు చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది.

కాజల్
కాజల్
author img

By

Published : Mar 29, 2020, 6:57 AM IST

కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌ పరిస్థితులతో చిత్రీకరణలు లేక ఇంటికే పరిమితమయ్యారు సినీతారలంతా. ఇప్పుడీ అనుకోని విరామ సమయన్ని తారలంతా ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందాల చందమామ కాజల్‌ మాత్రం దూరదర్శన్‌లో 'రామాయణ', 'మహాభారతం' ధారావాహికలను చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

దేశంలో ఏర్పడ్డ లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు వాళ్ల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్‌ ఛానెల్స్‌లో 30ఏళ్ల నాటి విజయవంతమైన 'రామాయణం', 'మహాభారతం' సీరియళ్లను ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడీ క్రమంలోనే కాజల్‌ కూడా తన ఇంట్లో కూర్చోని 'రామాయణం' చూస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

"దూరదర్శన్‌లో నాకెంతో ఇష్టమైన రామాయణం సీరియల్‌ను నా కుటుంబంతో కలిసి చూస్తున్నా. ఒకప్పుడు మా వారాంతమంతా ఈ ధారావాహికతోనే గడిచిపోయేది. ఇప్పుడిన్నేళ్ల తర్వాత 'రామాయణం', 'మహాభారతం'లు మళ్లీ ప్రసారం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవి నాకు నా చిన్ననాటి రోజుల్ని మళ్లీ గుర్తుచేశాయి. ఈ తరం పిల్లలకు మన పురాణాల గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇదొక గొప్ప వేదిక అవుతుంది."

-కాజల్, సినీ నటి

ప్రస్తుతం కాజల్.. చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటించబోతుంది. దీంతో పాటు 'మోసగాళ్లు', 'భారతీయుడు 2', 'ఇండియన్‌ సాగా' తదితర చిత్రాల్లో నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.