రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న 'చంద్రముఖి-2' లో బాలీవుడ్ భామ కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. 2005లో పి.వాసు దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన 'చంద్రముఖి' మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా 'చంద్రముఖి 2' తెరకెక్కుతోంది. దీనికి కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. తాజాగా కియరా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాఘవా లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇటీవల బాలీవుడ్లో 'కాంచన' రీమేక్‌గా 'లక్ష్మీబాంబ్'ను తెరకెక్కించారు రాఘన లారెన్స్. ఇందులో కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించింది.
ఇది చూడండి లెఫ్ట్‌నెంట్ అధికారి బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్