*'కాతువక్కుల రెండు కాదల్' సినిమాలో(kaathu vaakula rendu kadhal release date) సమంత ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. కతిజా అనే పాత్రలో సామ్ కనిపించనుంది. నోటిలో వేలు పెట్టి, అలా చూస్తున్న సమంత(samantha movies) లుక్ అలరిస్తోంది. విజయ్ సేతుపతి(vijay sethupathi new movie) ఫస్ట్‌లుక్‌ను కూడా ఈరోజు ఉదయమే రిలీజ్ చేశారు. ఇందులో రాంబోగా విజయ్ నటిస్తున్నారు. వీరితో పాటు నయనతార(nayanthara movies list) కూడా కీలకపాత్ర పోషిస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమను తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
*తేజ, శివానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అద్భుతం'(adbutham 2021). ఈ శుక్రవారం(నవంబరు 19న) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని 'అరెరె ఏంటీ దూరమే' వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒకే ఫోన్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు(హీరోహీరోయిన్లకు) ఉంటే ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే విభిన్న కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ కథనందించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
*ప్రముఖ హాస్యనటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు(sampoornesh babu movies) మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని మొదలుపెట్టారు. వడ్ల జనార్దన్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై గురురాజ్, కార్తిక్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సత్యప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు.
ఈ సినిమాలో సంపూ సరసన అద్వితిశెట్టి కథానాయికగా చేస్తోంది. త్వరలోనే గోవా, ముంబయిలో 'మిస్టర్ బెగ్గర్'(sampoornesh babu new movie) తొలి షెడ్యూల్ మొదలుపెడతామని సంపూ చెప్పారు. ఈ చిత్రానికి పీఆర్ సంగీతమందిస్తున్నారు.
*కల్పిత కథల కంటే నిజ జీవిత కథలను తెరకెక్కిస్తే ప్రేక్షకులకు బాగా చేరువవుతామని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది అన్నారు. కన్నడ నటుడు వశిష్ట సింహా(vasishta simha movies) ప్రధాన పాత్రల్లో నటించిన 'నయీం డైరీస్'(nayeem diaries trailer 2020) ప్రచార చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో సంపత్ నంది విడుదల చేశారు. ఈ సందర్భంగా నయీం డైరీస్ ప్రచార చిత్రం బాగుందని అభినందించారు. వశిష్ట సింహాకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు.
ప్రముఖ రచయిత దాము బాలాజీ దర్శకత్వంలో సీఏ వరదరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నయీం(nayeem khan) నిజ జీవితంలోని అసలు వాస్తవాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించిట్లు బాలాజీ తెలిపారు. నక్సలైట్ రౌడీషీటర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలను సమగ్రంగా చూపించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇవీ చదవండి: