ETV Bharat / sitara

వచ్చే నెల నుంచి 'కార్తికేయ' సీక్వెల్ షూటింగ్​ - entertainment news

హీరో నిఖిల్​-దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్​లోని 'కార్తికేయ' సీక్వెల్​ షూటింగ్.. వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Kaarthikeya movie sequel will going to shoot from march 2
వైవిధ్య కథాంశంతో కార్తికేయ సీక్వెల్​
author img

By

Published : Feb 29, 2020, 5:16 AM IST

Updated : Mar 2, 2020, 10:25 PM IST

సైంటిఫిక్​ థ్రిల్లర్ 'కార్తికేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్. 2014లో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని దక్కించుకోవడం సహా చక్కటి వసూళ్లు సాధించింది. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీక్వెల్‌ 'కార్తికేయ 2'కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 2న తిరుపతిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తొలిభాగాన్ని తీసిన చందూ మొండేటినే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Kaarthikeya movie sequel will going to shoot from march 2
'కార్తికేయ' చిత్రబృందం

మరిన్ని సర్​ప్రైజ్​లు

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "చందూ మరోసారి మనకు తెలియని ఓ కొత్త కథతో రాబోతున్నాడు. ఇందులో సర్‌ప్రైజ్‌లు ఒక్కొక్కటి త్వరలో తెలియజేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

ఇదీ చూడండి.. 'కోబ్రా' కోసం విక్రమ్​ ఇన్ని గెటప్పుల్లోనా?

Last Updated : Mar 2, 2020, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.