ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు జూ.ఎన్టీఆర్. అతడి తర్వాతి సినిమాపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 'కె.జి.ఎఫ్'ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.
ఇదీ కారణం..
ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. వెంటనే అభిమానుల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్‌తో ఈ డైరక్టర్ సినిమా చేస్తాడంటూ చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం 'కె.జి.ఎఫ్' సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు ఫలిస్తే 2020 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
ఇది చదవండి: టిక్‌టాక్‌లో 'జూనియర్ ఎన్టీఆర్' సందడి