RRR Rjamaouli: 'ఆర్ఆర్ఆర్'తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న ఎన్టీఆర్.. తన వ్యక్తిగత విషయాన్ని ఓపెన్‌గా పంచుకున్నారు. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని చెప్పారు. ఒకానొక సందర్భంలో డిప్రెషన్‌లోకి వెళ్లానని, అందులోంచి బయటపడడానికి రాజమౌళినే కారణమని అన్నారు.
"18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాను. రెండో సినిమాకే స్టార్ స్టేటస్ చూశాను. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‌కు గురయ్యా. సినిమా విజయం సాధించనందుకు బాధపడలేదు. భవిష్యత్ ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యాను. అపజయాన్ని కష్టంగా భావించాను. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయేవాడిని. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది రాజమౌళినే. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు.. చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు" అని ఎన్టీఆర్ చెప్పారు.
దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
ఇవీ చదవండి:
- RRR Pre Release Event: ఎన్టీఆర్ నాలో సగభాగం: రామ్ చరణ్
- రాజమౌళితో పని చేయడం సవాల్.. కష్టమైనా ఇష్టపడి చేశా: ఎన్టీఆర్
- 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు
- 'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌పై సందేహాలు.. రాజమౌళి క్లారిటీ
- 'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెట్టొచ్చు'
- 'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్
- రాజమౌళి డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్
- RRR movie: రాజమౌళితోనే అది సాధ్యమైంది- హీరో రామ్‌చరణ్
- నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్