2007లో వచ్చిన 'చక్ దే! ఇండియా' గుర్తుందా.. షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. భారత మహిళా హాకీ జట్టు కోచ్‌గా బాద్ షా నటన అద్భుతం. అయితే ఇందులో మొదట హీరోగా అనుకుంది షారుఖ్‌ను కాదంట. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కోసం దర్శకుడు ఈ కథ సిద్ధం చేశాడట.
అయితే డేట్స్ ఖాళీ లేక జాన్ ఆ చిత్రాన్ని వదులుకునే సరికి బంతి షారుఖ్ గ్రౌండ్లో పడింది. భారత హాకీ జట్టు కెప్టెన్ కబీర్ ఖాన్‌గా షారుఖ్ ఆకట్టుకున్నాడు. తను ఆటగాడిగా ఉన్నప్పుడు పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన అనంతరం బహిష్కరణకు గురవుతాడు. కొన్నేళ్ల తర్వాత టీమిండియా మహిళా హాకీ జట్టు కోచ్‌గా మారి వారిని ప్రపంచ విజేతగా ఎలా మార్చాడనేది చిత్ర కథాంశం.
ఈ చిత్రానికి షిమిత్ అమిన్ దర్శకత్వం వహించాడు. యశ్‌రాజ్ ఫిల్మ్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: జియో గిగాఫైబర్‌తో ఇక ఇంట్లోనే 'ఫస్ట్‌డే ఫస్ట్ షో'