బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు జాన్ అబ్రహం ప్రస్తుతం చేస్తున్న సినిమా చిత్రం 'సత్యమేవ జయతే 2'. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'కు సీక్వెల్‌గా తీస్తున్నారు. కరోనా వల్ల మార్చి నుంచి షూటింగ్ నిలిచిపోయింది. ప్రభుత్వం చిత్రీకరణల విషయంలో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మిలాప్ జవేరి, కథానాయకుడు జాన్‌ను కలిశారు. ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. "నా హల్క్, నా హీరో, నా రామ్, నా జాన్ అబ్రహంను 3 నెలల తర్వాత కలిశాను" అంటూ రాసుకొచ్చారు.
గతేడాది గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ తేదీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును టీ-సిరీస్, ఎమ్మై ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్ అబ్రహం వీరేంద్ర రాఠోడ్‌గా, దివ్య ఖోస్లా కుమార్ సీతా రామేశ్వర్‌గా కనిపించనున్నారు.
ఇది చూడండి : దొంగా దొంగా వచ్చాడే.. అన్నీ దోచుకు పోతాడే!
-
Reunited with my Hulk, my Hero, my Ram, my @TheJohnAbraham after 3 months! ❤️🔥 #SatyamevaJayate2 on the way! 💪 @iamDivyaKhosla @itsBhushanKumar @nikkhiladvani @monishaadvani @madhubhojwani @TSeries @EmmayEntertain pic.twitter.com/3YFW5Hc58z
— Milap (@zmilap) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reunited with my Hulk, my Hero, my Ram, my @TheJohnAbraham after 3 months! ❤️🔥 #SatyamevaJayate2 on the way! 💪 @iamDivyaKhosla @itsBhushanKumar @nikkhiladvani @monishaadvani @madhubhojwani @TSeries @EmmayEntertain pic.twitter.com/3YFW5Hc58z
— Milap (@zmilap) June 16, 2020Reunited with my Hulk, my Hero, my Ram, my @TheJohnAbraham after 3 months! ❤️🔥 #SatyamevaJayate2 on the way! 💪 @iamDivyaKhosla @itsBhushanKumar @nikkhiladvani @monishaadvani @madhubhojwani @TSeries @EmmayEntertain pic.twitter.com/3YFW5Hc58z
— Milap (@zmilap) June 16, 2020