'చక్ దే! ఇండియా'.. హాకీ గురించి ప్రపంచానికి చాటి చెప్పిన బాలీవుడ్ చిత్రం. ఇందులో భారతీయ హాకీ జట్టుకు మాజీ కెప్టెన్‌గా షారుఖ్ ఖాన్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
పాకిస్థాన్ జట్టు చేతిలో ఓటమిపాలై బహిష్కరణకు గురైన ఖాన్ కొన్నేళ్ల తర్వాత వివాదాస్పద క్రీడాకారిణిలతో ఓ జట్టును తయారు చేస్తాడు. బంగారు పతకం సాధించే దిశగా ముందుకెళ్తాడు. అలా ఆయన చేసిన కృషి.. కోచ్ అంటే ఇలా ఉండాలనే అభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఈ పాత్రకు షారుఖ్ మాత్రమే న్యాయం చేయగలడు అనేంతలా కోచ్ కబీర్ ఖాన్ పాత్రలో ఈ హీరో ఒదిగిపోయాడు.
కోచ్‌గా జాన్ అబ్రహం అయితే ఎలా ఉంటుంది? ఆయనకు ఈ పాత్రకు సంబంధం ఏంటి? అంటే.. షారుఖ్ పోషించిన పాత్ర కోసం 'చక్ దే ఇండియా' చిత్ర బృందం ముందుగా జాన్ అబ్రహంను సంప్రందించింది. ఆ సమయంలో అబ్రహంకు కుదరకపోగా... షారుఖ్ తన ఖాతాలో ఓ విజయం వేసుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'మాట ఇవ్వకుండా సినిమా చేయాలనిపిస్తోంది'