తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం సొంతం చేసుకున్న 'జెర్సీ' సినిమా.. షాహిద్ కపూర్ హీరోగా ప్రస్తుతం అదే పేరుతో బాలీవుడ్లో (Jersey Hindi Movie) రీమేక్ అవుతోంది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri).. హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను (Jersey Trailer Release Date) నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న షాహిద్ ఈ కార్యక్రమం కోసం.. ముంబయికి రానున్నారు. ఈ సినిమా డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హీరోగా.. తివ్యా అన్నపూర్ణ దర్శకత్వం వహించిన చిత్రం 'బాబ్ బిశ్వాస్'. ఈ సినిమా డిసెంబరు 3న (Bob Biswas Release Date) జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

కొత్త తరహా కథలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు గౌతమ్ (Raja Goutham).. కొత్త సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఎస్.ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యారబోలు నిర్మించనున్నారు. ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మోనోఫోబియాతో బాధపడుతన్న ఒక రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పడు.. ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ కె.సంతోష్, సినిమాటోగ్రఫి మోహాన్ చారి.
ఇదీ చూడండి: RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవ్గణ్ పాత్ర ఇంతేనా?