జెన్నిఫర్ లోపేజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి అంటూ ఓ సినీ గేయరచయిత ఆమె గురించి ఏ విధంగా రాశాడో తెలియదు గానీ.. ఆమె మాత్రం చెక్కిన శిల్పంలా.. పాడితే కోయిల ఆలాపనలా.. నర్తిస్తే నెమలి సిగ్గుపడేలా.. నటిస్తే పాత్రకు జీవం వచ్చేలా ఉంటుంది. అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ రాణించిన జెన్నిఫర్ లోపేజ్ పుట్టినరోజు నేడు. మరి ఆమె జీవితంపై ఓ లుక్కేద్దామా!
బ్యాక్‌గ్రౌండ్..
జెన్నిఫర్ లోపేజ్ అసలు పేరు జెన్నిఫర్ లిన్ లోపేజ్. లాటిన్ తల్లిదండ్రులకు అమెరికాలోని న్యూయార్క్‌లో 1969 జులై 24న జన్మించింది. అభిమానులు ముద్దుగా ఆమెను జెలో అని పిలుచుకుంటారు. ఐదేళ్ల వయసులోనే ఇద్దరు సోదరీమణులతో కలిసి సంగీతం, నృత్యం నేర్చుకుని వేదికలపై చిన్నచిన్న ప్రదర్శనలు ఇచ్చేది.
సింగింగ్ కెరీర్..
జెన్నిఫర్ లోపేజ్ మొదటి ఆల్బమ్ 'ఇఫ్ యూ హ్యాడ్ మై లవ్'. 6 దేశాల్లో ఈ ఆల్బమ్ రికార్డు విజయాన్ని అందుకుంది. అనంతరం ఆన్ ది సిక్స్, జేలో, దిస్ ఈజ్ మీ లాంటి విజయవంతమైన ఆల్బమ్‌లతో పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఓ పక్క పాప్ గాయనిగా అలరిస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తూ అంచెలంచెలుగా ఎదిగింది జెన్ని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సినీ కెరీర్..
జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి చేరిన జెన్నీ, ‘మై లిటిల్ గర్ల్’ (1986) సినిమాలో చిన్న వేషం కోసం ఆడిషన్స్‌కు వెళ్లి తెరపై కనిపించింది. అప్పుడే పెద్ద తారవ్వాలని కలలు కంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల ఇల్లు వదిలి మ్యూజిక్ ప్రదర్శనలు చేసింది. అలాగే టీవిల్లో కనిపించింది. 1997లో సెలెనా బయోపిక్‌లో ప్రధాన పాత్రలో మెరిసి వెండితెర ముచ్చట తీర్చుకుంది.
అనంతరం అనకొండ, ఔట్ ఆఫ్ సైట్, ద సెల్, ద వెడ్డింగ్ ప్లానర్, ద బాయ్ నెక్ట్స్ డోర్ లాంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకుంది. హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం పొందిన లాటిన్ యువతిగా పేరు తెచ్చుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆమె అందం.. గూగుల్ ఇమేజెస్ తెచ్చింది..
2000 సంవత్సరంలో జరిగిన గ్రామీ అవార్డు వేడుకకు జెన్నిఫర్ లోపెజ్ హాజరైంది. ఉల్లి పొర లాంటి ఆకుపచ్చ వస్త్రాలతో మెరిసిన జెన్నీ.. అందరినీ ఆకర్షించింది. మరుసటి రోజు దినపత్రికల్లో, టీవీల్లో ఆమె డ్రెస్ గురించే వార్తలు షికారు చేశాయి. ప్రజలు ఆ డ్రెస్‌లో ఉన్న జెన్ని ఫొటోల కోసం వెతికేసరికి కంప్యూటర్ సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయి. అప్పుడే గూగుల్ సంస్థకు ఇమేజెస్ పోర్టల్‌ను తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. గూగుల్ ఇమేజెస్ తీసుకొచ్చేందుకు పరోక్షంగా సాయపడిన జెన్నికి ధన్యవాదాలు కూడా తెలిపిందా సంస్థ.
అవార్డులు..
నటిగా, గాయనిగా జెన్నిఫర్‌కు వచ్చిన పురస్కారాలకు లెక్కలేదు. ఆల్మా, అమెరికా మ్యూజిక్ అవార్డులు, బిల్బౌర్డ్ మ్యూజిక్ పురస్కారాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇవేకాకుండా గిన్నిస్ రికార్డు కూడా రెండు సార్లు అందుకుంది జెన్ని. 'జే టూ ది' లో ది రీమిక్స్ (2003) అనే ఆల్బమ్‌కు, ఆన్ ది ఫ్లోర్ (2012) అనే మరో ఆల్బమ్‌కు రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది.
ఇది చదవండి: 'స్టార్లతో సినిమా తీస్తే మంచి హిట్టవుతుంది'