ETV Bharat / sitara

మోహన్​బాబు కుటుంబాన్ని చూస్తే జాలేస్తోంది: జీవిత - ప్రకాశ్​రాజ్ మా ఎలక్షన్

'మా' ఎన్నికల్లో(maa elections 2021) ఎందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని జీవిత ప్రశించారు. ధర్మంగా పోరాడాలని మంచు విష్ణు ప్యానెల్(manchu vishnu panel)​కు సూచించారు.

jeevitha mohan babu
జీవిత రాజశేఖర్- మోహన్​బాబు
author img

By

Published : Oct 8, 2021, 8:01 PM IST

'మా' ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన సభ్యులు ఓటు వేయడానికి భయపడుతున్నారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్(jeevitha rajasekhar daughters) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు పంపి మంచువిష్ణు ఓట్లు వేయించుకున్నారని మరోసారి ఈమె ఆరోపణలు చేశారు.

జీవిత రాజశేఖర్

మా ఎన్నికల్లో ధర్మంగా పోరాడాలని జీవిత అన్నారు. మంచి చేయడానికి వచ్చే వాళ్లు బెదిరింపులు, ప్రలోభాలకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. మోహన్​బాబు కుటుంబాన్ని చూస్తే జాలేస్తుందని చెప్పిన జీవిత... నరేశ్ తవ్విన గుంటలో మోహన్​బాబు(mohan babu movies) కుటుంబం పడుతుందని వ్యాఖ్యానించారు.

గత కార్యవర్గంలో నరేశ్(naresh maa president) స్వార్థంతో పనిచేశారని విమర్శించిన జీవిత.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజీవ్ కనకాల, శివబాలాజీలు సవ్యంగా నడుచుకోవాలని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో సరదా కోసం తాను పోటీ చేయడం లేదని అన్నారు. మంచి కోసం పోరాటం చేసే తమలాంటి వాళ్లను చులకనగా చూడొద్దని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.